Sunday, May 9, 2010

Mamidikaya Mukkala Pachhadi (Mango Pickle) :మామిడికాయ ముక్కల పచ్చడి




కావలిసినవి::

పచ్చి  మామిడికాయ - 1
ఉప్పు _ 3  టీ  స్పూన్స్(సుమారుగా )

(***నోటు ::--. కారం కన్నా ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి . ఎందుకంటే మెత్తటి ఉప్పు కదా రెండు రోజులు అయ్యాక ముక్కలు  కొంచెం ఉప్ప పడతాయి . లేకపోతే ఉప్పు కారం కొలతలు సమం. )


కారం _ 4 టీ  స్పూన్స్ (సుమారుగా)

మెంతి పిండి _  పావు   టీ స్పూన్  ** మెంతులు వేయించి పొడి కొట్టుకొని పెట్టుకోవాలి**
  (మెంతి పిండి ఎక్కువ అయితే పచ్చడి చేదు వస్తుంది. అందుకని కొంచమే కలపాలి)


పోపు  (ఆవాలు, పచ్చి సెనగపప్పు, మినప పప్పు, ఎండు మిరపకాయలు , ఇంగువ, కరివేపాకు)
నూనె


విధానము ::

ముందుగ మామిడికాయని కడిగి తడి లేకుండా తుడిచి ముక్కలు కోసి  పెట్టుకోవాలి.  తరువాత కారం , ఉప్పు, మెంతి పిండి అన్ని ముక్కలలో వేసుకొని సమంగా కలిసేటట్లు కలుపుకోవాలి.

కొంచెం ఎక్కువగా నూనె వేసుకొని పోపు వేసి  వేడి ఆరిన తరువాత పచ్చడిలో  కలపండి .   గాలి చొరకుండా సీసాలో వేసుకొని  మూత పెట్టుకొని ఫ్రిజ్జులో పెట్టుకోండి . ఇది రెండు నెలల వరకు నిలువ వుంటుంది.

Ingredients ::
Raw Mango - 1
Red chilli powder - 4 Tea  spoons
Salt -3 Tea spoons
(*** note :: We need to put less salt. Cause its table salt the mango pieces will be salty after few days)
Roasted fenugreek powder - 1/4 tea spoon

For seasoning :
mustard seeds,chana dal, urad dal, red chillies, hing , curry leaves.



Procedure :

1. Wash Mango with cold water. Wipe with a dry cloth. Cut it into pieces.
2. Take a dry bowl put salt,red chilli powder, roasted fenugreek seed  powder . Add mango pieces to this mixture and mix them thoroughly .
3. Put some oil in kadai add the seasoning ingredients . Once they are done let them cool for some time and then mix into the Mango mixture.
4. Store it in air tight containers put them in fridge.



Today's dinner.  vankaya onion curry,mango pickle,curd rice.